News January 25, 2025
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం వరించడంపై అనంతపురం జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 1960లో జన్మించిన బాలయ్య 14ఏళ్ల వయసులోనే తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు. సినీరంగంలో రాణిస్తూ 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన హ్యాట్రిక్ గెలుపు సాధించారు. బసవతారకం ఆసుపత్రితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
Similar News
News February 18, 2025
వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.
News February 18, 2025
అనంతపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
అనంతపురం జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం, సోమవారం 36.21°C నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.