News January 25, 2025
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం వరించడంపై శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 1960లో జన్మించిన బాలయ్య 14ఏళ్ల వయసులోనే తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 109 సినిమాల్లో నటించారు. సినీరంగంలో రాణిస్తూ 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన హ్యాట్రిక్ గెలుపు సాధించారు. బసవతారకం ఆసుపత్రితో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
Similar News
News November 28, 2025
మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.
News November 28, 2025
NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
News November 28, 2025
21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.


