News December 13, 2024
పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు

సినీ హీరో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
Similar News
News October 27, 2025
ANU పరిధిలోని కాలేజీలకు సెలవు

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మొంథా తుఫాను నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలకు ఈ నెల 29 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News October 27, 2025
ANU: పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీజీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల మూడో సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లై) పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు చెల్లింపుకు చివరి తేది నవంబర్ 3, రూ.100 జరిమానాతో నవంబర్ 6 వరకు అవకాశం. గ్యాలీలు నవంబర్ 4లోపు సమర్పించాలి. ఆన్లైన్ ద్వారా ఇంటర్నల్స్/మూక్లు/ప్రాక్టికల్ మార్కులను సమర్పించడానికి చివరి తేదీ: 15-12-2025
News October 27, 2025
గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కోసం మైనారిటీ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ, ఓఎంసీఏపీ, ఐఈఎస్ సంయుక్తంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, వయస్సు 30 లోపు ఉండాలని అధికారులు తెలిపారు. మొత్తం ఖర్చు రూ.1.15 లక్షలు 3 వాయిదాల్లో చెల్లించాలి. ఆసక్తిగల వారు నవంబర్ 2లోపు naipunuam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


