News June 23, 2024
పద్మశ్రీ సంకిన రామచంద్రయ్య మృతి

మణుగూరు పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్య కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించారు. మంత్రి సీతక్క పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్యకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయ కళను వెలుగులోకి తెచ్చినందుకు ఆయనకు 2022లో పద్మశ్రీ లభించింది.
Similar News
News December 20, 2025
ఖమ్మం ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 22న మచిలీపట్నం నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే వన్-వే స్పెషల్ రైలు (07401)కు ఖమ్మం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైలు గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకుంటుంది. ఇక్కడితో పాటు వరంగల్ స్టేషన్లోనూ ఈ రైలు ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
News December 20, 2025
ఖమ్మం: ‘ఆమె’దే హవా

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మహిళలు సత్తాచాటారు. మొత్తం 566 జీపీలకు గాను 297 స్థానాలు మహిళలు గెలిచారు. కాగా అత్యధికంగా తిరుమలాయపాలెంలో 40 జీపీలు ఉంటే 22, రఘునాథపాలెంలో 37 జీపీలకు 20 జీపిల్లో మహిళలు విజయం సాధించారు. అలాగే వైరా నియోజకవర్గంలో జనరల్ స్థానాల్లో ఐదుగురు బీసీ, ముగ్గురు ఎస్టీ మహిళలు, సత్తుపల్లిలో ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మహిళ అభ్యర్థి విన్ అయ్యారు.
News December 20, 2025
ఖమ్మం: క్లిక్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్టే..!

సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బహుమతులు, రుణాలు, ఆఫర్ల పేరుతో వచ్చే లింక్లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. అలాగే బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసే వారికి ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు.


