News July 9, 2024
పద్మాక్షి అమ్మవారికి పదివేల గాజులతో ప్రత్యేక అలంకరణ
హన్మకొండలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా నేడు నాలుగవ రోజు అమ్మవారికి 10,008 గాజులతో, వివిధ రకాల పూలతో, కూరగాయలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Similar News
News October 6, 2024
సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: వరంగల్ కలెక్టర్
వచ్చే సోమవారం అక్టోబర్ 7న కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డా.సత్య శారదా తెలిపారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని, కలెక్టర్ తెలిపారు.
News October 5, 2024
దాండియా వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దాండియా వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని దాండియా ఆడారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాకు, ఆచారాలు, కట్టుబాట్లను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం కాసేపు మహిళలతో మాజీ మంత్రి మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
News October 5, 2024
WGL: సమీక్ష నిర్వహించిన మంత్రి కొండా
సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ‘ఎకో టూరిజం’పై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎకో టూరిజం అభివృద్ధిపై కాసేపు అధికారులతో మంత్రి చర్చించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రీయాల్, తదితరులు ఉన్నారు.