News April 25, 2024

పద్మారావు మంచోడే: CM రేవంత్ రెడ్డి

image

సికింద్రాబాద్‌ MLA పద్మారావు మంచోడే అని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ‘పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయన్ని పోటీకి దింపారు. పజ్జన్న నామినేషన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు’ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Similar News

News November 20, 2025

గ్రామాల దేవాలయాలకు సోలార్ భద్రత: చిలుకూరు అర్చకుడు

image

సీఎస్ఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు, దేవాలయాల భాగస్వామ్యానికి కొత్త దారిని చూపుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ ముందడుగు వేశారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో 60 సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను అందించారు. వీటిని ఎస్బీఐ, యూబీఐ సంయుక్తంగా అందజేశారు. ఇలాంటి రిమోట్ సర్వైలెన్స్ సొల్యూషన్లను సీఎస్ఆర్‌కు అనుసంధానించడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొ న్నారు.

News November 20, 2025

HYD: బాధితులకు అండగా సైబర్ పోలీసులు

image

డబ్బు పోగొట్టుకున్న బాధితులకు సైబర్ క్రైం పోలీసులు అండగా నిలిచారు. ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణం నుంచే స్పందించి సైబర్ నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారి నుంచి రూ.63.23 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు 18 మంది నిందితులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీసీపీ సాయిశ్రీ తెలిపారు.

News November 20, 2025

HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

image

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్‌లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్‌మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.