News April 6, 2025
పద్మావతి అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు జడ్జి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కుటుంబ సమేతంగా శనివారం రాత్రి దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ ఈఓ శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Similar News
News November 16, 2025
కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
News November 16, 2025
లోక్ అదాలత్లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.
News November 16, 2025
ఇల్లెందులో సేవలు మెరుగుపరుస్తాం: మంత్రి పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో భాగంగా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. ఆసుపత్రి సేవలు బాగున్నాయని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో సేవలు మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఆసుపత్రికి కావాల్సిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


