News July 25, 2024

పనిచేయని EVMలు బెంగళూరుకు

image

నెల్లిమర్ల EVM గోడౌన్‌లో ఉన్న పని చేయని, అదనంగా ఉన్న, ఎన్నికలలో డెమో కు వినియోగించిన డమ్మీలను బెంగళూరుకి తరలిస్తున్నారు. బెల్ కంపెనీకి రెండు వాహనాల్లో కలెక్టర్ డా. బీఆర్.అంబేడ్కర్ ఆధ్వర్యంలో గురువారం పంపించారు. ఎన్నికలలో వినియోగించని (డిఫెక్ట్ ) EVMలలో బీయూలు 174, సీయూలు 930, వివిపాట్‌లు 224 యూనిట్లను బెల్‌కు పంపించారు.

Similar News

News December 5, 2025

VZM: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. అంతలోనే ఆత్మహత్య.!

image

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో జరిగింది. కోరాడ వీరేంద్ర (25) సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకున్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి చేయడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా,వీరేంద్ర ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 5, 2025

విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభ‌విస్తే చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఎక్క‌డైనా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌విస్తే స‌హించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కలెక్టరేట్‌లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర‌స్థాయిలో అత్యున్న‌త ప్ర‌భుత్వ యంత్రాగం ఉంద‌ని, ప్ర‌భుత్వం మంచి పోష‌కాహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇక‌ముందు జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు.

News December 5, 2025

విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

image

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.