News April 13, 2025
పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం: సీతక్క

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పనులు దక్కించుకొని సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకే నిధులు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News April 20, 2025
GTకి గుడ్ న్యూస్.. త్వరలో స్టార్ ప్లేయర్ రీఎంట్రీ?

తొలి 2 మ్యాచ్‌ల తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లిపోయిన GT స్టార్ బౌలర్ కగిసో రబాడా త్వరలో తిరిగిరానున్నట్లు సమాచారం. మరో 10 రోజుల్లో అతను జట్టుతో చేరే అవకాశం ఉందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. ప్రస్తుతం 5 విజయాలతో గుజరాత్ టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. రబాడా కూడా వస్తే బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.
News April 20, 2025
చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 20, 2025
అనకాపల్లి: భర్తపై వేడినీరు పోసిన భార్య

అనకాపల్లి మండలం తుంపాలలో భర్తపై భార్య వేడి నీరు పోసి గాయపరిచింది. భర్త చంద్రశేఖర్‌ను ఇల్లరికం రావాలని భార్య లోకేశ్వరి ఒత్తిడి తీసుకువస్తుంది. భర్త నిరాకరించడంతో లోకేశ్వరి వేడి నీరు పోసినట్లు సీఐ విజయ్ కుమార్ శనివారం తెలిపారు. గాయపడిన భర్త అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.