News February 6, 2025
పనులను త్వరగా పూర్తి చేయాలి: ASF అదనపు కలెక్టర్

జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి గమ్మనియల్, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 16, 2025
మహిళల ఆరోగ్యమే సమాజానికి ఆరోగ్యం: మంత్రి జూపల్లి

మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలోని (కూకట్‌పల్లి) తులసివనం వద్ద 5K రన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు కుటుంబంతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (1/2)

ప్రత్యేక రాష్ట్రమంటూ లేనప్పుడు తెలుగువారికి అన్నివైపులా అవమానాలే జరిగేవి. అది భరించలేకపోయిన పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించారు. మద్రాసు CM రాజాజీ వార్నింగ్ కారణంగా తెలుగు కాంగ్రెస్ వారెవరూ మద్దతుగా రాలేదు. ఒంటరైనా, పేగులు పుళ్లు పడి పురుగులు పట్టి అనుక్షణం నరకాన్ని చూస్తున్నా దీక్షను మాత్రం శ్రీరాములు ఆపలేదు. చివరికి 1952, డిసెంబరు 15న అమరుడయ్యారు.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (2/2)

తమ ఆత్మగౌరవం కోసం ఆ మహానుభావుడు చిత్రవధ అనుభవించి చనిపోతే తెలుగువారెవరూ స్పందించలేదు. అంత్యక్రియలకే దిక్కులేదు. గాయకుడు ఘంటసాల ఎద్దులబండిపై శవయాత్ర ప్రారంభించారు. ఈలోగా చేరుకున్న ప్రకాశం పంతులు బండెక్కి తెలుగువారి చేతకానితనంపై బూతులు లంకించుకున్నారు. క్షణాల్లో నగరమంతా వార్త పాకింది. లక్షల్లో జనం జతయ్యారు. మద్రాసు తగలబడింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రకటన వెలువడింది.