News January 24, 2025

పనులను నాణ్యతతో చేపట్టాలి: జనగామ అదనపు కలెక్టర్

image

పాఠశాల మరమ్మతు పనులను నాణ్యతతో చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల, మల్కాపూర్, పల్లగుట్ట, చిల్పూర్ లలో చేపడుతున్న పాఠశాల మరమ్మతు పనులను సందర్శించి పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు.

Similar News

News February 15, 2025

పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

image

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణరావు వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.

News February 15, 2025

HYD: 3 లైన్లలో నడిచేవి 57 మెట్రో రైళ్లు..!

image

నగరంలో ప్రస్తుతం 57 మెట్రో రైళ్లు 3 లైన్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గణనీయంగా పెరుగుతున్న ప్రయాణికులకు రైళ్లు సరిపోకపోవడంతో నిత్యం మెట్రోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీనికి ఇందుకు అదనంగా మరో 10 రైళ్లను తీసుకురావాల్సిన అవసరం ఉందని మెట్రో వర్గాలు అంచనా వేశాయి. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామన్నారు.

News February 15, 2025

నూజివీడు: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

నూజివీడు మండలానికి చెందిన 10వ తరగతి విద్యార్థి ప్రీ ఫైనల్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి విజయవాడలో  చదువుతున్నాడు. మార్కులు తక్కువ రావడంతో చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!