News October 10, 2024

పనుల్లో జాప్యం చేయవద్దు: కలెక్టర్

image

చిన్న చిన్న సమస్యలను సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేయడం సరికాదని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ పథకాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రణాళికయుతంగా పనిచేయాలన్నారు.

Similar News

News November 9, 2024

విశాఖ: ఇసుక నిల్వ కేంద్రం, రవాణా కోసం లాటరి

image

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానం సంబంధించి డిపోల ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ శుక్రవారం ఇచ్చారు. విశాఖ కలెక్టర్ ఆదేశాలు మేరకు జీవో విడుదల చేశారు. ఆసక్తి కలవారు భీమిలీ, ముడసర్లోవ, గాజువాకలో 4 ఏకరాల స్థలం కలిగి ఉండాలని అన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 14వ తేదీలోపు రూ.5,000 డీడీ గనుల శాఖ కార్యాలయంలో చెల్లించాలన్నారు.

News November 9, 2024

సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News November 8, 2024

అరకు: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా బ్రోచర్ రిలీజ్ చేసిన హీరో

image

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అల్లూరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమ బ్రోచర్‌ను అరకులోయలో షూటింగ్‌కి వచ్చిన హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. గంజాయి, సారా వంటి మాదకద్రవ్యాల నివారణకు, వాటితో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలను హీరో వెంకటేశ్ ప్రశంసించారు. యువత మాదకద్రవ్యాల వైపు వెళ్లి భవిష్యత్తు పాడుచేసుకోవద్దని సూచించారు.