News April 3, 2025

పనుల ఆలస్యంపై చిత్తూరు కలెక్టర్ ఆగ్రహం

image

చిత్తూరు-గుడియాత్తం అంతరాష్ట్ర రహదారి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌పై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ రహదారి మరమ్మతు పనుల పురోగతిని R&B అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. సకాలంలో పనులు చేయకపోతే కాంట్రాక్టర్‌ను మార్చేస్తామని హెచ్చరించారు.

Similar News

News April 11, 2025

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి

image

చిత్తూరులో మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని దురాలోచనలను పోగొట్టడానికి జ్యోతిరావ్ ఫూలే అపారమైన కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కన్వీనర్ షణ్ముగం, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

News April 11, 2025

రేపే రిజల్ట్స్.. చిత్తూరు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 30,713 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 15,639 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,074మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.

News April 11, 2025

ఫూలే జయంతి వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

image

ప్రభుత్వం ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ భవన్లో ఉదయం 10.30గంటలకు కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని  జయప్రదం చేయాలని కోరారు. 

error: Content is protected !!