News April 1, 2025
పన్నుల ద్వారా ఇప్పటివరకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం: కమిషనర్

పన్ను ద్వారా బల్దియాకు సుమారు రూ.80 కోట్లకు పైగా ఆదాయం వసూలు చేసినట్లు బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. హన్మకొండ అశోక టాకీస్ వద్ద గల ఈ సేవా కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. రెగ్యులర్ పన్ను వసూళ్లతో పాటు ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీ పథకంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సుమారు రూ.80 కోట్లకు పైగా వసూళ్లు జరిపామని అన్నారు.
Similar News
News April 5, 2025
BRS రజతోత్సవ సభ.. పాలమూరు నేతలతో KCR MEETING

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News April 5, 2025
మంచిర్యాల: మరో మైలురాయిని చేరుకున్న సింగరేణి

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుందని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లుతో యూనియన్ నాయకులు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తీవ్ర వర్షాలు, కఠినమైన వేసవి పరిస్థితుల మధ్య 69.01మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27మిలియన్ టన్నుల డిస్పాచ్ను సాధించి సింగరేణి సంస్థ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు.
News April 5, 2025
ఈ నెల 8న అఖిల్ మూవీ అప్డేట్

కొత్త దర్శకుడు మురళీ కిషోర్, అక్కినేని అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి అప్డేట్ రానున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. అఖిల్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూరల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని సమాచారం. దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అఖిల్ చివరి చిత్రం ‘ఏజెంట్’ రిలీజై రెండేళ్లు కావొస్తోంది.