News August 21, 2024

పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో ఎంపీ వేమిరెడ్డికి చోటు

image

పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను లోక్‌సభ స్పీకర్ ఓం బీర్లా నియమించారు. ఈ కమిటీలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. అందులో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభనుంచి ఏడుగురిని నియమించారు. వీరు 2025 ఏప్రిల్ 30వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు.

Similar News

News December 18, 2025

టాప్-2లో నెల్లూరు జిల్లా..!

image

నెల్లూరు జిల్లాకు 2025-26 GDDP టార్గెట్ రూ.92,641కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.36,766కోట్లతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాకు 79/100 మార్కులొచ్చాయి. 2025-26లో రూ.2952కోట్ల పాల దిగుబడులతో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 97వేల ఇళ్లను మంజూరు చేయగా 68వేలు గ్రౌండింగ్ అయ్యాయి. 43వేల ఇళ్లను పూర్తి చేశామంటూ జిల్లా వివరాలను CMకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు.

News December 18, 2025

తమిళనాడు బోట్లతో తీవ్ర ఇబ్బందులు: కలెక్టర్

image

తమిళనాడు నుంచి జిల్లాలోని సముద్ర జిల్లాలోనికి అక్రమంగా బోట్లు వస్తున్నాయని కలెక్టర్ హిమాన్ష శుక్లా అన్నారు. అమరావతిలో CM ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షలో ఆయన మాట్లాడారు. తమిళనాడు బోట్లతో జిల్లా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్ష్ CMకు విన్నవించారు. జువ్వలదిన్నె హార్బర్‌ను కార్యాచరణలోకి తీసుకొస్తే సమస్యను పరిష్కరించవచ్చన్నారు.

News December 18, 2025

నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

image

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM.. సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.