News August 22, 2024

పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో ఎంపీ వేమిరెడ్డికి చోటు

image

పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. ఈ కమిటీలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. అందులో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభనుంచి ఏడుగురిని నియమించారు. వీరు 2025 ఏప్రిల్ 30వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు.

Similar News

News September 17, 2024

కావలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

కావలి మండలం తాళ్లపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల శ్రీకాంత్, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులు కావలి మండలం జువ్విగుంటపాలెం నుంచి కావలి వస్తుండగా తాళ్లపాలెం వద్ద లారీ వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుబ్బారావు నడుముపై లారీ టైర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రీకాంత్‌ను చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు.

News September 17, 2024

నెల్లూరు: రైతులకు GOOD NEWS.. గడువు పెంపు

image

నెల్లూరు జిల్లాలోని పంటల నమోదులో చేయాల్సిన ఈక్రాప్ బుకింగ్ ఈకేవైసీ గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీతో ముగిసిందని జిల్లాలో చాలాచోట్ల నమోదులో కాలేదని దీంతో గడువు పెంచినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పంటలు వేసిన రైతులు ఈ క్రాప్ బుకింగ్ తో పాటు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని కోరారు.

News September 17, 2024

పొట్టకూటి కోసం కువైట్‌ వెళ్లి నెల్లూరు వాసి సూసైడ్

image

అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.