News August 21, 2024
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో ఎంపీ వేమిరెడ్డికి చోటు
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చోటు దక్కింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను లోక్‌సభ స్పీకర్ ఓం బీర్లా నియమించారు. ఈ కమిటీలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. అందులో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభనుంచి ఏడుగురిని నియమించారు. వీరు 2025 ఏప్రిల్ 30వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు.
Similar News
News September 9, 2024
గూడూరులో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం
గూడూరులో ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గంగా కావేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి గూడూరు వద్ద కిందకు దిగాడు. మళ్లే ఎక్కే క్రమంలో రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. సదరు వ్యక్తి శరీరం రెండు ముక్కలు కావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 9, 2024
తూపిలిపాలెం బీచ్ ఘటన.. ఇద్దరు మృతి
ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ వద్ద వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సముద్రంలో వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. నాయుడుపేట నుంచి వినాయక నిమజ్జనం కోసం బీచ్‌కు వచ్చిన యువకుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో మునిరాజా, ఫయాజ్ మృతి చెందగా.. మరో యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు.
News September 9, 2024
3 నెలల బిడ్డ తల్లిదండ్రులకు అప్పగింత
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు నెలల చంటిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సాయంత్రం వరకు పసికందు సంబంధికులు ఎవరూ రాకపోవడంతో ఆ బిడ్డను నెల్లూరులోని శిశు గృహకు తరలించారు. ఈ క్రమంలో తమ బిడ్డ కనిపించడం లేదని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు బస్టాండ్ వద్దని దొరికిన శిశువును చూపారు. తమ బిడ్డే అని చెప్పడంతో అధికారులు ఆ పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు.