News August 3, 2024

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి ఎన్నిక

image

పార్లమెంట్ పరిధిలోని పబ్లిక్ అండర్ టేకింగ్‌ల కమిటీ ( COPU) సభ్యుడిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ప్రభాకర్ రెడ్డి కమిటీ సభ్యుడిగా సేవలు అందించనున్నారు. సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టీడీపీ కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News September 30, 2024

నెల్లూరు: SP కార్యాలయానికి 105 ఫిర్యాదులు

image

నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్లు ASP CH.సౌజన్య తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.

News September 30, 2024

SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.

News September 30, 2024

నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.