News August 3, 2024

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి ఎన్నిక

image

పార్లమెంట్ పరిధిలోని పబ్లిక్ అండర్ టేకింగ్‌ల కమిటీ ( COPU) సభ్యుడిగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు ప్రభాకర్ రెడ్డి కమిటీ సభ్యుడిగా సేవలు అందించనున్నారు. సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో టీడీపీ కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 10, 2025

నెల్లూరు: రెండేళ్లు అవుతున్నా…!

image

నెల్లూరు పెద్దాసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్(CCU) భవనాన్ని APMSIDC దాదాపు రూ.12 కోట్లతో నిర్మించింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటంతో ఆ భవనాన్ని తీసుకొనేందుకు GGH అధికారులు ముందుకు రాలేదు. అక్కడ వైద్య పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మిగిలిన పనులు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించి ఇంకా రూ.10 కోట్ల మేరా పనులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండేళ్లు గడిచినా పనులు కాలేదు.

News December 10, 2025

కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

image

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్‌లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

News December 10, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.