News September 29, 2024

పబ్లిక్ గ్రీవెన్స్ డే ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

image

కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు కలెక్టర్ జి.సృజన ఆదివారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. డివిజన్, మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉంటుందని సూచించారు.

Similar News

News December 10, 2025

రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

image

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్‌ఏఎస్‌సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.

News December 9, 2025

కృష్ణా: డీఈఓ బదిలీ.. నూతన డీఈఓగా సుబ్బారావు

image

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బదిలీ అయ్యీరు. పల్నాడు జిల్లాకు రామారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో యూవీ సుబ్బారావును నియమించారు. సుబ్బారావు ఎన్టీఆర్ జిల్లా డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆయన మచిలీపట్నం డీవైఈఓగా విధులు నిర్వర్తించారు. సౌమ్యుడుగా, వివాదరహితునిగా సుబ్బారావు పేరు తెచ్చుకున్నారు.

News December 9, 2025

గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

image

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్‌ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.