News September 29, 2024
పబ్లిక్ గ్రీవెన్స్ డే ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్
కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు కలెక్టర్ జి.సృజన ఆదివారం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. డివిజన్, మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉంటుందని సూచించారు.
Similar News
News October 16, 2024
గుడివాడలో అమలులోకి డిప్యూటీ సీఎం ఆదేశాలు
డిప్యూటీ CM పవన్ ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కాలుష్య సమస్య పరిష్కారానికి అధికారులు నడుం బిగించారు. తాగునీటి నమూనాల సేకరణకు 44మంది ఇంజినీరింగ్ సహాయకులతో 6 బృందాలను ఏర్పాటు చేయగా ఈ బృందాలు గ్రామాల్లో పర్యటించి నీటి నమూనాలు సేకరిస్తున్నాయి. 43 గ్రామాల్లో తాగునీరు కలుషితమైందని MLA వెనిగండ్ల రాము కంకిపాడులో జరిగిన పల్లె పండుగ సభలో పవన్ దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News October 16, 2024
ఘంటసాల: ‘దేవాలయాలు, జనావాసాల మధ్య మద్యం షాపు వద్దు’
దేవాలయాలు, జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దని ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డికి గ్రామస్థులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని సంత మార్కెట్ వెనుక భాగంలో షాపును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలియవచ్చిందన్నారు. ఆ ప్రాంతానికి 100 మీటర్ల లోపే వీరబ్రహ్మేంద్ర స్వామి, పోలేరమ్మ దేవాలయాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.
News October 16, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS
* కృష్ణా నదీ తీరంలో ఈ నెల 22న భారీ డ్రోన్ షో
* విజయవాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
* కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
* నందిగామ: తుఫాను హెచ్చరికలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వాసంశెట్టి సుభాశ్
* బహిరంగ చర్చకు సిద్ధమా జగన్?: మంత్రి రవీంద్ర
* కృష్ణా: భార్యా భర్తలకు 9 మద్యం షాపులు
* కంచికర్ల: రైసు మిల్లుపై మంత్రి నాదెండ్ల మెరుపుదాడి