News January 30, 2025
పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారు: కేతిరెడ్డి

వైసీపీ ప్రభుత్వంలో చేసిన డెవలప్‌మెంట్‌ను పబ్లిసిటీ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చెప్పేది అబద్ధమే అయినా ప్రజలు నమ్మే విధంగా చెబుతారు. అలా 4 సార్లు అబద్ధాలు చెప్పి గెలిచారు. డెవలప్‌మెంట్‌పై జగన్ దృష్టి పెట్టలేదనేది ఆరోపణ. వెల్ఫేర్‌కు అయినంత పబ్లిసిటీ డెవలప్‌మెంట్‌కు కాలేదు.’ అని అన్నారు.
Similar News
News February 26, 2026
31,972 మంది విద్యార్థులు.. 143 పరీక్ష కేంద్రాలు

అనంతపురం జిల్లాలో మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 31,972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News February 25, 2026
గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.
News February 24, 2026
తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


