News April 16, 2025

పబ్‌లో HYD అమ్మాయిలతోనూ డాన్సులు

image

HYD చైతన్యపురిలోని పబ్‌లో యువతులతో <<16103579>>అర్ధనగ్న<<>> డాన్సులు చేయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా.. ఇందులో ముంబై యువతులే కాకుండా HYDలోని వనస్థలిపురం, ఉప్పల్, సికింద్రాబాద్ అమ్మాయిలతోనూ డాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. యువకులను ఆకర్షించేందుకు పబ్‌లోకి ఫ్రీగా పంపించి, వారికి కంపెనీ ఇస్తూ అధికమొత్తంలో ఖర్చు చేయించి ఆ బిల్ కూడా వారితో కట్టిస్తున్నట్లు అధికారులు తేల్చారు.

Similar News

News November 6, 2025

సంగారెడ్డి: ఖోఖో సెలక్షన్ల తేదీలు మార్పు

image

సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ ఖోఖో సెలక్షన్స్ టోర్నమెంట్ తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అండర్- 14, 17 విభాగాల బాలురకు ఈ నెల 11న, బాలికలకు 12న సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.

News November 6, 2025

అమ్మకానికి RCB.. మార్చి 31 నాటికి కొత్త ఓనర్!

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను <<18032689>>అమ్మకానికి<<>> ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని, 2026 MAR 31 నాటికి కొత్త ఓనర్ చేతుల్లోకి ఫ్రాంచైజీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో పేరెంట్ కంపెనీ Diageo (United Spirits Limited) ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే వచ్చే IPL సీజన్‌లో కొత్త కంపెనీ ఆధ్వర్యంలో RCB ఆడే ఛాన్స్ ఉంది.

News November 6, 2025

సమన్వయంతో అధికారులు పనులు పూర్తి చేయాలి: మేయర్

image

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.