News January 20, 2025
పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పమిడిముక్కల మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24) లు బైక్‌పై వెళ్తుండగా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కెసిపి ఫ్లైఓవర్ గోడను అదుపుతప్పి ఢీకొనడంతో మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఉదయాన్నే మంచు ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పమిడిముక్కల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 7, 2025
బైక్ చక్రంలో చీర ఇరుక్కొని మహిళ మృతి: ఎస్సై చంటిబాబు

చీర బైక్ చక్రంలో చిక్కుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన గుడివాడ రూరల్ ప్రాంతంలో జరిగింది. సెరికలవపూడి గ్రామానికి చెందిన కోన నాగేశ్వరరావు భార్య కోన నాగమల్లేశ్వరి బంధువుల దిన కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో నూజెండ్ల గ్రామం వద్ద వారు వెళుతున్న బైక్ చక్రంలో చీర చిక్కుకొని ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై చంటిబాబు తెలిపారు.
News February 6, 2025
ఫైళ్ల క్లియరెన్స్.. కొల్లు రవీంద్రకు 12వ ర్యాంకు

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర 12వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.
News February 6, 2025
ఉంగుటూరు: ఎలుకల మందు తాగిన వ్యక్తి.?

ఎలుకల మందు తాగి వ్యక్తి చనిపోయిన ఘటన ఉంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మానికొండకు చెందిన షేక్ మునీర్ మద్యానికి బానిసై ఎలుకల మందు వాటర్‌లో మిక్స్ చేసి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బెజవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.