News June 12, 2024

పయ్యావుల, సత్యకుమార్, సవితకు మంత్రి పదవులు

image

ఉమ్మడి అనంత జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవులు వరించాయి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవితకు కేబినెట్‌లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ఆ ఒక్కరూ మన ధర్మవరం ఎమ్మెల్యే కావడం విశేషం. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News March 22, 2025

ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

image

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

News March 22, 2025

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నిందితుల అరెస్ట్

image

హిందూపురం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులు మంజుల, కానిస్టేబుల్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. టూటౌన్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సహకారంతో మోడల్ కాలనీలో మంజుల వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈశ్వర్ అనే వ్యక్తి పారిపోయాడు. మంజుల, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News March 22, 2025

ATP: శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్ష: ఎస్పీ

image

ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్‌కి చేరుకొని రక్షిస్తుందన్నారు.

error: Content is protected !!