News February 6, 2025
పరకాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పరకాల మండలం పైడిపల్లికి చెందిన మొగిలి(60) ఈ నెల 1న తన భార్యతో కలిసి మిర్చి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యలో బయటకు వెళ్తున్న అని తిరిగి రాలేదు. మొగిలి ఆచూకీ కోసం వెతుకుతుండగా పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అతడి భార్య తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 27, 2025
వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.
News March 27, 2025
WGL: ఈ వారంలో అధిక ధర పలికిన పత్తి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
News March 27, 2025
సంగెం: బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపెళ్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.