News December 8, 2024
పరకాల: రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి మండలానికి చెందిన వేముల సుమన్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో రేగొండ వైపునకు వెళుతున్నారు. ఈ క్రమంలో పరకాల సమీపంలో శుక్రవారం సాయంత్రం వాగు సమీపంలో వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమన్ కూతురు సాత్వికతో పాటు పలువురు గాయపడ్డారు. సాత్వికను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News January 8, 2026
వరంగల్: పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సభల్లో 31 మందితో కూడిన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడుగా పి.మహేశ్, ప్రధాన కార్యదర్శిగా పొడపంగి నాగరాజు, కోశాధికారిగా డి.ప్రణయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు.
News January 8, 2026
WGL: సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్లు!

జిల్లాలో సన్న వడ్ల బోనస్ బకాయిలు రూ.54 కోట్ల మేర ఉన్నాయి. 15,311 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయగా, మరో 3,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎస్ఎస్పీ కింద రూ.346.3 కోట్లను రైతులకు చెల్లించగా, మరో రూ.20 కోట్లను చెల్లించాల్సి ఉంది. సన్న వడ్ల బోనస్ కింద రూ.75.2 కోట్లను చెల్లించాల్సి ఉండగా, రూ.21.2 కోట్లను మాత్రము ప్రభుత్వం చెల్లించింది.
News January 7, 2026
జూనియర్ కాలేజీలకు డిజిటల్ టీవీలు: వరంగల్ DIEO

వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలు పంపిణీ చేసినట్లు DIEO డా.శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఆదేశానుసారం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ బోధనకు ఉపకరించే సామాగ్రి అందించినట్లు వెల్లడించారు. నేడు గీసుకొండ కళాశాలకు అందించామన్నారు. ఒక్కో కళాశాలకు రూ.6లక్షలకు పైగా విలువైన డిజిటల్ సామాగ్రి పంపిణీ చేశారన్నారు.


