News May 26, 2024
పరవాడలో యువకుడు ఆత్మహత్య

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.
Similar News
News September 16, 2025
ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
News September 16, 2025
ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.
News September 16, 2025
విశాఖ: వృద్ధురాలిని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

వృద్ధురాలి డబ్బులు దోచేసిన ముగ్గురిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ నగర్లో ఉంటున్న వృద్ధురాలికి ఈ ఏడాది మే 16న ఫోన్ చేసి బంధువులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె నుంచి ధఫదపాలుగా రూ.4 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. డబ్బలు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఖాతాల ఆధారంగా రాజస్థాన్కి చెందిన మొయినుద్దీన్, గణేశ్, దినేశ్ను పట్టుకున్నారు.