News May 26, 2024

పరవాడలో యువకుడు ఆత్మహత్య

image

పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.

Similar News

News February 16, 2025

డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారికి ఫైన్ వేయండి: కలెక్టర్

image

విశాఖ నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారిని గమనించి అపరాద రుసుములను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 15, 2025

విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News February 15, 2025

ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకుందాం: కలెక్టర్

image

ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని ఆహ్లాద‌క‌ర‌ వాతావ‌ర‌ణంలో ప‌ని చేద్దామ‌ని స్వ‌చ్ఛ ఆంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంధిర ప్ర‌సాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌దర్శ‌కాల‌కు అనుగుణంగా ఫిబ్ర‌వ‌రి నెల 3వ శ‌నివారం జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, క‌ళాశాలలు, పాఠ‌శాల‌లు, ఇత‌ర‌ సంస్థ‌ల ప‌రిధిలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నాట్లు ఆయన తెలిపారు.

error: Content is protected !!