News November 28, 2024
‘పరవాడ ఘటనలో 27 మందికి అస్వస్థత’

పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకైన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 27 మంది అస్వస్థతకు గురైనట్లు సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. విశాఖ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను వారు గురువారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు.
Similar News
News February 23, 2026
పనితీరు మారకుంటే ఇంటికి వెళ్లండి: కలెక్టర్ ఆగ్రహం

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులకు ఆయన సోమవారం క్లాస్ పీకారు. ‘పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి’ అని ఘాటుగా హెచ్చరించారు. మెమోలు ఇచ్చినా మార్పు రాకపోవడాన్ని తప్పుబడుతూ, ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News February 23, 2026
విశాఖ: సేవ పునర్విక పేరుతో దోపిడీ

విశాఖపట్నం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా సోమవారం సేవ్ పునర్విక పేరుతో స్కానర్లు పట్టుకుంటూ సేవ పేరుతో ముగ్గురు వ్యక్తులు అనధికార దోపిడీకి తెర లేపారు. కనీసం ఆ పాప పేరు పలకడం తెలియడం లేదు వాళ్లకి, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే భీమవరానికి చెందిన వారిమని చెబుతున్నారు. స్థానికులు కాదు సేవ తప్పు దోవ పడుతుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News February 23, 2026
మధురవాడ: డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక- మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.


