News November 28, 2024

‘పరవాడ ఘటనలో 27 మందికి అస్వస్థత’

image

పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకైన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 27 మంది అస్వస్థతకు గురైనట్లు సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. విశాఖ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను వారు గురువారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు.

Similar News

News December 7, 2024

విశాఖ నుంచి విమానాల దారి మళ్లింపు

image

విశాఖలో ఇవాళ పొగ మంచు తీవ్రంగా కురిసింది. ఎయిర్‌పోర్టు ఏరియాలో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖ రావాల్సిన.. ఇండిగో సంస్థకు చెందిన మూడు విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-వైజాగ్ విమానాలను హైదరాబాద్‌కి మళ్లించారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చే విమానాన్ని భువనేశ్వర్‌లో ల్యాండ్ చేశారు.

News December 7, 2024

నేడు విశాఖకు మంత్రి లోకేశ్ రాక

image

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖకు రానున్నారు. మధాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి రోడ్డు మార్గాన వెళ్తారు. ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో జరగనున్న ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనంలో పాల్గొంటారు.

News December 7, 2024

విశాఖ: ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం చాటింగ్

image

విశాఖ పీఎంపాలెంలో నిన్న ఒకరు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పట్టణానికి చెందిన హేమంత్ రెడ్డికి 2017లో వివాహం జరిగింది. డెలీవరీ బాయ్‌గా పనిచేసే అతను భార్య(25)తో కలిసి పీఎంపాలెంలో ఉంటున్నారు. భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రాంలో ఒకరితో చాటింగ్ చేయడాన్ని భర్త గమనించి గొడవ పడ్డారు. ఈ విషయం అత్తమామలకు తెలిసి మందలించడంతో మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.