News February 16, 2025

పరవాడ: టోరెంట్ ఫార్మాలో ఇద్దరి కార్మికులకు తీవ్ర అస్వస్థత

image

పరవాడ ఫార్మాసిటీలో టోరెంట్ ఫార్మా పరిశ్రమలో ఆదివారం కెమికల్ పౌడర్ ప్యాకింగ్ చేస్తుండగా ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులు పి. రామకృష్ణ, జె. బసవేశ్వరావును ఆసుపత్రికి తరలించామన్నారు. భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ విధంగా జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

Similar News

News November 7, 2025

నల్గొండలో ర్యాగింగ్‌పై కలెక్టర్‌ ఆరా

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్‌తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

News November 7, 2025

₹4 లక్షలు పెద్ద అమౌంటే కదా: షమీ మాజీ భార్యకు సుప్రీం ప్రశ్న

image

భారత క్రికెటర్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ₹1.5లక్షలు, కూతురికి ₹2.5లక్షలు నెలవారీ భరణంగా ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. షమీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని అమౌంట్‌ను పెంచాలని కోరారు. దీంతో షమీ, బెంగాల్ ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. ‘ఇప్పటికే ఇస్తున్న ₹4L పెద్ద అమౌంటే కదా’ అని జహాన్‌ను ప్రశ్నించింది. విచారణను DECకు వాయిదా వేసింది.

News November 7, 2025

బండి సంజయ్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

image

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఈవోను పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కోరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పింది. మతం ఆధారంగా ఓటు వేయాలని సంజయ్ కోరారని, ఎన్నికల నిబంధలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది.