News April 9, 2025
పరవాడ ఫార్మాసిటీలో యువకుడు మృతి

పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంగళవారం ఓ కంపెనీకి సంబంధించిన వ్యర్థపదార్థాల డ్రమ్ములు క్లీన్ చేస్తుండగా కెమికల్ పడి పడాల హరినాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
Similar News
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 27, 2025
జనగామ: బాల్య వివాహ నిర్మూలనకు ప్రత్యేక ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

జనగామ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వందరోజుల “చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ, భారత్” కార్యక్రమంలో జనగామ జిల్లా పరిపాలన కీలక నిర్ణయాలు చేపట్టింది. బాల్య వివాహాల నిర్మూలనకు సంబంధించిన ప్రత్యేక ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ.. బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటి నివారణకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.
News November 27, 2025
NRPT: ఎన్నికల సమాచారం కోసం ‘Te-Poll’ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని ఓటర్లకు అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్ సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు.


