News September 12, 2024
పరవాడ ఫార్మాసిటీలో విషాదం

పరవాడ ఫార్మాసిటీలో విషాదం నెలకొంది. ఎడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమంలో అదృశ్యమైన ఆర్.సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై కనిపించాడు. మంగళవారం విధులకు హాజరైన ఆయన తిరిగి ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్‌కి అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఘటనపై విచారణ జరిపి మృతుని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
Similar News
News December 16, 2025
విశాఖ: సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓకు డాక్టరేట్

ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి, సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఓరుగంటి నరేష్ కుమార్‌కు డాక్టరేట్ లభించింది. “వర్క్‌ప్లేస్ డైనమిక్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్‌ది ఐటీ సెక్టార్ పోస్ట్ పాండమిక్-ఏ కేస్ స్టడీ ఆన్‌వర్క్ ఫ్రమ్‌హోమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” అనే అంశంపై లోతైన అధ్యయనానికి ఈడాక్టరేట్ ప్రదానం చేశారు.
News December 16, 2025
సింహాచలం కొండపై HT లైన్లకు గ్రీన్ సిగ్నల్

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్‌కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
News December 16, 2025
విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్

విశాఖలో మంత్రి లోకేశ్ మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందిన తనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని సతీశ్వరరెడ్డి కోరారు. కోనసీమ, పోలవరంలో గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలనీ కోరారు.


