News September 12, 2024

పరవాడ ఫార్మాసిటీలో విషాదం

image

పరవాడ ఫార్మాసిటీలో విషాదం నెలకొంది. ఎడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమంలో అదృశ్యమైన ఆర్.సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై కనిపించాడు. మంగళవారం విధులకు హాజరైన ఆయన తిరిగి ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్‌కి అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఘటనపై విచారణ జరిపి మృతుని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

Similar News

News November 15, 2025

ఇఫ్కో ఛైర్మన్‌తో సీఎం చర్చలు

image

విశాఖలో జరుగుతున్న సమ్మిట్‌లో ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. గ్రీన్ అమ్మోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బయో-ఫర్టిలైజర్, బయో-స్టిమ్యులెంట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాల పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

News November 15, 2025

మార్గశిర ఉత్సవాలకు దేవదాయ శాఖ మంత్రికి ఆహ్వానం

image

బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆలయ ఈవో శోభారాణి ఆహ్వానించారు. విజయవాడలో శనివారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. లక్షలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు, తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రికి ఈవో వివరించారు.

News November 15, 2025

CII సమ్మిట్.. శ్రీసిటీలో మరో 5 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

image

CII సమ్మిట్‌లో మరో 5 ప్రాజెక్ట్‌లను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి (D) శ్రీసిటీలో ఈ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నట్లు CM చెప్పారు. పార్క్‌లో ఇప్పటికే 240 యూనిట్లు ఉండగా.. వెర్మీరియన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్మ్‌వెస్ట్ మిరాయ్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ గ్యాస్, ఆన్‌లో‌డ్‌గేర్స్ ఎక్స్‌పోర్ట్స్, యూకేబీ ఎలక్ట్రానిక్స్ ఈ లిస్ట్‌లో చేరనున్నాయి.