News November 28, 2024
పరవాడ: ఫార్మా ప్రమాదంలో మరో కార్మికుడి మృతి

పరవాడ ఠాగూర్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక కార్మికుడు గురువారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడు పిఠాపురానికి చెందిన సీహెచ్.వీరశేఖర్‌గా గుర్తించారు. మరో కార్మికుడు టీ.చిన్నకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐటీయూ పేర్కొన్నారు. ఫార్మా యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీఐటీయూ నేత గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Similar News
News November 13, 2025
పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో CM చంద్రబాబు

విశాఖలో CII సుమ్మిట్లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నట్లు CM పేర్కొన్నారు.
News November 13, 2025
విశాఖలో నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్..

CII సమ్మిట్‌కు ముందుగా దేశంలోని ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, CEOలు, విదేశీ రాయబారులతో CM చంద్రబాబు నేడు భేటీ కానున్నారు.
➣ఉదయం నోవాటెల్‌లో ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం
➣‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’- సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్
➣మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో భేటీ
➣ సాయంత్రం‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై కార్యక్రమం
➣ CII నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
News November 12, 2025
విశాఖ: ఈనె 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాఖలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న చిత్రలేఖనం,17న వకృత్వ పోటీలు,18న సభ్యత్వ సేకరణ, 19న ఇందిరాగాంధీ జయంతి, మ్యూజికల్ చైర్ పోటీలు, 20న గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు.


