News April 3, 2024

పరవాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో లంకెలపాలెం సబ్బవరం రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వెస్ట్ బెంగాల్‌కి చెందిన సహదీప్ (52) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సహదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు స్మైల్ ఎక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బాలసూర్యారావు తెలిపారు.

Similar News

News January 9, 2025

వీసీ ఎంపికకు ఏయూ సెర్చ్ కమిటీ

image

ఏయూ వైస్ ఛాన్సలర్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఎన్ఐపిఈఆర్ డైరెక్టర్ యుఎస్ఎన్ మూర్తి, ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తరఫున ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ ఎస్.మహేంద్ర దేవ్, యూజీసీ నుంచి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బి.సత్యనారాయణను నియమించింది.

News January 9, 2025

ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుంది: సీఎం

image

విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. మరో వైపు అనకాపల్లి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందని CM చెప్పుకొచ్చారు.

News January 8, 2025

విశాఖ హిస్టరీలో మోదీయే తొలి ప్రధాని..!

image

విశాఖ మహానగరంలో ప్రధాన మంత్రి హోదాలో రోడ్ షో నిర్వహించనున్న మొదటి వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. గతంలో ప్రధాని హోదాలో విశాఖ వచ్చిన ఇందిరా గాంధీ, విశ్వనాథ ప్రతాప్‌సింగ్, పీవీ నరసింహారావు బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారు. కాగా మోదీ తొలిసారిగా నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. దీంతోపాటు రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.