News February 2, 2025
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.
Similar News
News November 22, 2025
iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.
News November 22, 2025
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదంతోపాటు స్వామి వారి ఫొటో ఆలయ అధికారులు అందజేశారు.
News November 22, 2025
అన్నమయ్య: అసెంబ్లీలో మాట్లాడేది వీళ్లే..!

రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ కోసం అన్నమయ్య జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. డైట్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీళ్లు వాళ్ల నియోజకవర్గంలోని సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారు.
మదనపల్లె:ఎం.పార్థసారథి
పీలేరు:కె.తేజశ్రీ
తంబళ్లపల్లె:జె.అనిల్ కుమార్
రాయచోటి: ఎం.సుష్మతాజ్
రాజంపేట: కొల్లి వీక్షిత, పట్నం సాయి
రైల్వేకోడూరు: ఎస్.నూర్ ఆయేషా


