News February 2, 2025
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.
Similar News
News November 27, 2025
వనపర్తి: మూడో విడత ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు

వనపర్తి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు మూడో విడతలో ఓటింగ్లో పాల్గొననున్నారు. మొదటి విడతలో 1,23,183, రెండో విడతలో 1,24,281 మంది ఓటర్లు ఉండగా, మూడో విడతలోని 87 పంచాయతీలలో 1,34,851 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తక్కువ పంచాయతీలు ఉన్నా, ఓటర్ల సంఖ్య మూడో విడతలోనే అధికంగా ఉంది.
News November 27, 2025
WPL షెడ్యూల్ విడుదల

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు 4వ ఎడిషన్ కొనసాగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, వడోదరలోని బీసీఏ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇవాళ WPL మెగా ఆక్షన్ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలను లీగ్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ ప్రకటించారు. ప్రస్తుతం ప్లేయర్ల వేలం కొనసాగుతోంది. మ్యాచ్ల తేదీలు త్వరలోనే వెల్లడించనున్నారు.
News November 27, 2025
కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.


