News February 2, 2025

పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

image

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.

Similar News

News February 8, 2025

శ్రీశైలంలో మద్యం తాగుతూ పట్టుబడిన వైసీపీ నేత!

image

శ్రీశైలం దేవస్థానం పరిధిలో వైసీపీ నేత మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దేవస్థానం నిబంధనలు అతిక్రమించి ఆలయ ఉద్యోగితో కలిసి రజాక్ అనే వ్యక్తి మద్యం తాగుతున్నారు. రాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవదాయ చట్టం ఉల్లంఘన మేరకు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. రజాక్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా తెలుస్తోంది.

News February 8, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మార్కెట్‌కు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆}  మధిరలో అంతరాయం

News February 8, 2025

కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!