News June 12, 2024

పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నాం: మంత్రి

image

ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులుగా తాము పరస్పర అవగాహనతో కలిసి సాగుతున్నామని మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలున్నాయంటూ ఓ న్యూస్ ఛానల్ లోనూ, దినపత్రికలోనూ వచ్చిన తప్పుడు కథనాలపై మంత్రులు ఇరువురు స్పందించారు. అవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కొన్ని వ్యతిరేక శక్తులు కావాలని తమపై బురదజల్లే చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

Similar News

News March 20, 2025

వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,700 పలికింది. 341 రకం మిర్చికి నిన్న రూ.12,800 ధర రాగా ఈరోజు రూ. 13,000 అయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా బుధవారం రూ.16వేలు ధర పలకగా ఈరోజు రూ.15,500కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు.

News March 20, 2025

నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

image

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. 

News March 20, 2025

వరంగల్: కాళేశ్వరానికి భారీ నిధులు

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల సహా పలు ప్రధాన ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్ రూ. 4028.59కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించగా ఇందులో సింహభాగం కాళేశ్వరానికి రూ.2,685కోట్లు ఇచ్చింది. దీంతో పెడింగ్‌లోని ప్రాజెక్టులు పనులు పూర్తికానున్నాయి.

error: Content is protected !!