News February 15, 2025

పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

image

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణరావు వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.

Similar News

News September 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

image

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్‌మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.

News September 17, 2025

బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజ్‌నాథ్‌కు వీడ్కోలు

image

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు: కవిత

image

TG: MLC పదవికి తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ‘రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎన్నికైనప్పుడు ఆ సీటు 6 నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే ఛైర్మన్‌ను మళ్లీ కలుస్తా’ అని మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.