News January 28, 2025
పరిగిలో యాక్సిడెంట్.. ఇద్దరి పరిస్థితి సీరియస్

వరి నాట్లు వేసేందుకు బైక్‌పై వెళుతున్న కూలీలను సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 163 హైవేలో బైక్‌పై శివ, నర్సింహులు, నరహరి వెళ్తుండగా సిమెంట్ ట్యాంకర్ ఢీకొని తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదైంది.
Similar News
News February 11, 2025
కరీంనగర్: చింతచెట్టు పైనుంచి పడి రైతు మృతి

జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన రైతు చెంచల సంపత్ (35) మంగళవారం చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. మృతుడు సంపత్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
నెల్లూరు: తల్లిని కాపాడబోయి వాగులో మునిగి యువకుడి మృతి

అనంతసాగరం మండలం శంకర్ నగరం గ్రామం వద్ద కొమ్మలేరు వాగులో మునిగి ఉప్పలపాటి ఆకాష్ అనే యువకుడు మృతి చెందాడు. వాగు సమీపంలో గడ్డి కోసేందుకు వెళ్లిన తల్లి వాగులో పడిపోగా ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి వాగులో మునిగి ఆకాశ్ మృతి చెందాడు. కళ్లముందే కొడుకు వాగులో మునిగి చనిపోవడంతో తల్లి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బీటెక్ చదివిన ఆకాశ్ మృతి చెందడంతో శంకర్ నగరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.