News February 18, 2025

పరిగిలో సినిమా షూటింగ్ సందడి  

image

యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’, తాజాగా ఈ మూవీలోని ‘ఓ చిన్నా రాములమ్మా’ సాంగ్ లైవ్ షూటింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ షూట్ పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరా బాద్ తండా సమీపంలోని గుట్టపై సన్నివేశాలను చిత్రీకరించారు. త్రినాథరావు నక్కి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాజేష్ దండ, ఉమేష్ KR బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 26న రిలీజ్ కానుంది. 

Similar News

News December 9, 2025

ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు

image

భద్రాద్రి జిల్లాలో మొదటి దశలో 8మండలాల్లో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295మంది సిబ్బంది నియమించామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఎస్ఈసీ రాణి కుముదినికి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News December 9, 2025

సిద్దిపేట: ఎన్నికల రోజు స్థానిక సెలవు: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 11న జరగనున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ హైమావతి సెలవు ప్రకటించారు. గజ్వేల్, మర్కుక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌలతాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు. ప్రజలంతా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News December 9, 2025

HYD: గ్రేట్.. 9 మందికి ప్రాణం పోశారు!

image

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండ రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్‌ డెడ్ కావడంతో వారి కుటుంబాలు అవయవదానానికి ముందుకొచ్చాయి. ఈ మహోన్నత నిర్ణయం ద్వారా కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను సేకరించి 9 మందికి ప్రాణం పోశారు. తమ బాధను పక్కన పెట్టి చూపిన వీరి త్యాగం అందరికీ స్ఫూర్తినిచ్చింది. అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి ఊపిరిపోద్దాం.