News February 19, 2025
పరిగి: కరెంట్ పోల్‌కు ఉరేసుకొని సూసైడ్

పరిగిలో విషాదం ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. నజీరాబాద్ తండాకు చెందిన భారతి పరిగి మండలం హనుమాన్ గండి సమీపంలో ఉన్న కరెంట్ పోల్‌కు ఉరేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 20, 2025
ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.
News March 20, 2025
‘CSR నిధులతో చెరువుల అభివృద్ధి’

ఔటర్ రింగు రోడ్డు పరిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. CSR నిధులతో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని హైడ్రా కమిషనర్ 72 సంస్థల ప్రతినిధులకు సూచించారు. చెరువుల సుందరీకరణకే పరిమితం కారాదని, చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సంస్థలకు సూచించారు.
News March 20, 2025
రాజకీయ నాయకులతో మహబూబాబాద్ కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. ఓట్ల నమోదు ప్రక్రియ గురించి రాజకీయ పార్టీల నాయకుల నుండి సలహాలు సూచనలు తీసుకున్నారు. అనంతరం వాడితో మాట్లాడుతూ.. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీ నాయకులు విజయ సారధి రెడ్డి, మార్నేని వెంకన్న, సురేశ్ పెరుగు కుమార్, శివరాజ్ పాల్గొన్నారు.