News February 17, 2025
పరిగి టీచర్కు యాక్సిడెంట్

మొయినాబాద్ మం.లోని కనకమామిడి చౌరస్తాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పరిగిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే శ్రీను, అతడి భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. మొయినాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
Similar News
News November 19, 2025
కొనుగోలు వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, ఎఫ్పీఓల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
News November 19, 2025
జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్పర్సన్ స్వప్న తెలిపారు.