News March 23, 2025

పరిగి: పది పరీక్ష రాస్తూ కళ్లు తిరిగి పడిన విద్యార్థి

image

దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి రిషిక పరిగి మున్సిపల్‌లోని జిల్లా పరిషత్ నంబర్-టు పాఠశాలలో హిందీ పరీక్ష రాస్తోంది. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి తిరిగి పరీక్ష రాయించారు.

Similar News

News November 27, 2025

ఇక పీరియడ్ బ్లడ్‌తో క్యాన్సర్ గుర్తించొచ్చు!

image

దేశంలో ఏటా 77వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీనికి కారణం నొప్పిని కలిగించే PAP స్మియర్ వంటి పరీక్షలకు భయపడి మహిళలు చెక్ చేయించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో అసౌకర్యాన్ని, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని వైభవ్ శితోలే బృందం ‘M-STRIP’ అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. పీరియడ్ బ్లడ్‌తో పరీక్ష చేసుకుంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

News November 27, 2025

NGKL: మొదటి రోజు నామినేషన్లు మండలాల వారీగా ఇలా..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 121 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.
వంగూరు: 24
తెలకపల్లి: 25
తాడూరు: 23
కల్వకుర్తి: 19
వెల్దండ: 19
ఊర్కొండ: 11
అలాగే, వార్డులకు 26 మంది నామినేషన్లు వేశారు.

News November 27, 2025

సిరిసిల్ల: జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ జనరల్, వ్యయ అబ్జర్వర్లు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ అధికారులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.