News January 24, 2025
పరిగి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

పరిగి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. SI సంతోశ్ వివరాలు.. పోల్కంపల్లికి చెందిన బిచ్చయ్య, శ్రీనివాస్ పెట్రోల్ బంకు వెళ్లారు. వెనక్కి తీసుకునే క్రమంలో ఒక్కసారిగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా బిచ్చయ్య చనిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI వెల్లడించారు.
Similar News
News February 26, 2026
లడ్డూపై చర్చకు రెడీ: పయ్యావుల

AP: తిరుమల లడ్డూ అంశంపై శాసన మండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. ‘లడ్డూ అంశంపై దేవదాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే YCP సభ్యులు అడ్డుతగలడం సరికాదు. కేవలం సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి మీద వేయాలనే ధోరణితో వస్తున్నారు. తర్వాత వాక్ అవుట్ చేసి పోతున్నారు. YCP వాక్ అవుట్ పార్టీగా మారిపోయింది’ అని ఎద్దేవా చేశారు.
News February 26, 2026
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు రెండు పెట్రోల్ బంకులు: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) నుంచి రెండు పెట్రోల్ బంకులు మంజూరైనట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. వీటిలో ఒకటి శంకరంపేట్(ఆర్) మండల కేంద్రంలో, మరొకటి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన(ఆవుసులపల్లి) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శంకరంపేట్(ఆర్)లో బంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే మిగతావి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
News February 26, 2026
నిర్మల్: పుష్కరాలకు కావల్సిన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి, గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.


