News February 5, 2025

పరిటాల సునీతను ఆప్యాయంగా పలకరించిన జేసీ

image

అనంతపురంలో ‘అనంత ఉద్యాన సమ్మేళనం’ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం ఉందన్న చర్చ ఉంది. 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరగా అప్పటి నుంచి రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నాయి.

Similar News

News February 28, 2026

పింఛన్ పంపిణీలో కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ స్వయంగా నగదు అందజేశారు. గ్రామస్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 28, 2026

అనంత: వైద్యశాఖపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.