News August 9, 2024

పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం: డిప్యూటీ సీఎం

image

హైదరాబాదులో పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వ తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్రానెట్ విన్ ఓవెన్‌‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలు చర్చించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం అని అన్నారు.

Similar News

News September 25, 2024

BREAKING: HYD: మూసీలో అధికారుల సర్వే

image

HYD అత్తాపూర్‌ వద్ద ఆర్డీవో వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 4 బృందాలు కలిసి <<14194082>>మూసీలో నిర్మాణాలను<<>> పరిశీలిస్తున్నాయి. నది గర్భంలోని నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలను సేకరిస్తూ యాప్ ద్వారా నిర్ధారిస్తున్నాయి. మరోవైపు గండిపేట, రాజేంద్రనగర్ వద్ద మూసీలో అధికారులు సర్వే చేస్తున్నారు. కాగా మూసీ నిర్వాసితులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అర్హులకు పునరావాసం కల్పిస్తామని అధికారి దాన కిశోర్ స్పష్టం చేశారు.

News September 25, 2024

BREAKING: ఆపరేషన్ మూసీ.. అక్రమ నిర్మాణాల గుర్తింపు

image

మూసీ నదిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నది వద్ద ఇళ్లు కట్టుకున్న వారిని తరలించేందుకు రెడీ అయ్యారు. మూసీ గర్భంలో 2,166 నిర్మాణాలను అధికారులు గుర్తించగా ఇందులో HYDలో 1,595, రంగారెడ్డిలో332, మేడ్చల్‌లో 239 ఉన్నాయి. మూసీలో ప్రైవేట్ వ్యక్తులవి 16వేల నిర్మాణాలున్నాయి. కాగా పునరావాసం కింద నిర్వాసితులకు 15వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని అధికారి దానకిశోర్ తెలిపారు.

News September 25, 2024

28న ఎంజే మార్కెట్‌లో గజల్, షాయరీ

image

సిటీ వారసత్వాన్ని కాపాడడంతోపాటు, కళలను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న సాయంత్రం ఎంజే మార్కెట్ ప్రాంగణంలో గజల్, షాయరీ నిర్వహించనున్నారు. దీన్ని వినిపించడానికి ప్రముఖ కళాకారులు రాన్నారు. బుక్‌మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.